*విఆర్ఏ ల నిరవధిక సమ్మె కు మండల అంబెడ్కర్ యువజన సంఘం మద్దతు*

కమ్మర్పల్లి 29.జులై(జనంసాక్షి)కమ్మర్పల్లి మండల కేంద్రంలో గత 5 రోజులుగా విఆర్ఏలు తమ న్యాయమైన డిమాండ్లను అమలు చేయాలని చేస్తున్న నిరవధిక సమ్మెకు శుక్రవారం రోజున కమ్మర్పల్లి మండల అంబెడ్కర్ యువజన సంఘం  తరుపున వారికి సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మండల అంబెడ్కర్ యువజన సంఘం అధ్యక్షుడు సుంకరి.విజయ్ కుమార్ మాట్లాడుతూ
గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన సంక్షేమ పథకాలు అమలు చేయడం కోసం ప్రజలకు ప్రభుత్వనికి మధ్య వారధిగా ఉంటూ నిరంతరం కృషి చేసి పథకాలను విజయవంతం చేయడంలో విఆర్ఏ లది కీలకపాత్ర  పోషించారు అని తెలిపారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిండు సభలో అసెంబ్లీలో విఆర్ఏ లకు పే స్కెల్ అమలు చేస్తామని హామీ ఇచ్చారో ఆ హామీని వెంటనే అమలు చేయాలి,అలాగే అర్హత కలిగిన విఆర్ఏ లకు పదోన్నతులు కల్పించాలి,55 సంవత్సరాల పైబడిన ఉద్యోగుల స్థానంలో వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలి,వారికి ఉద్యోగ భద్రతా కల్పించాలి అని డిమాండ్ చేశారు.తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్  వెంటనే స్పందించి వారి న్యాయమైన డిమాండ్ లు నెరవేర్చాలని మండల అంబెడ్కర్ యువజన సంఘం తరుపున డిమాండ్ అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల అంబెడ్కర్ యువజన సంఘం గౌరవ అధ్యక్షుడు పాలేపు నర్సయ్య,కన్వీనర్ నిమ్మ రాజేంద్రప్రసాద్, తెడ్డు రమేష్,ఆర్గనైజింగ్ సెక్రెటరీ మేకల శ్రీకాంత్,కొంటికంటి నరేందర్,కార్యవర్గ సభ్యులు పాలేపు రాజేశ్వర్, వినయ్,శ్రీనివాస్, విఆర్ఏ జేఏసీ సభ్యులు, లక్ష్మణ్ ,శ్రవణ్,శంకర్,తదితరులు పాల్గొన్నారు.