విఆర్ఏ వీఆర్వోల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి
రుద్రంగి జూలై 28 (జనం సాక్షి)
రుద్రంగి తహశీల్దార్ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన విఆర్ఏ లు
ఈ సందర్భంగా విఆర్ఏ లు మాట్లాడుతూ… 2017 లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం,సిఎం కేసీఆర్ 55 ఏళ్ళు నిండిన వీఆర్ఏ ల స్థానంలో వారి కొడుకులకు నౌకరిస్తామని,పేస్కేల్ మంజూరు చేస్తామని 29 వ జీవో ప్రకారం చదువుకున్న వాళ్లకు ప్రమోషన్లు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు చేసిన వాగ్దానాలు నెరవేర్చక పోవడం బాధాకరం అన్నారు.10500 జీతంతో వీఆర్ఏ ల కుటుంబాలు గడిచే పరిస్థితుల్లో లేదని వారి యొక్క కనీస వేతనాలు అమలు చేస్తామని ఇప్పటివరకు చేయనందు వలన తమ సమస్యల పరిష్కారానికి రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నామని అన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వీఆర్ఏ ల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.విఆర్ఏ ల నిరసనకు విఆర్వో లు మద్దతు తెలిపారు.విఆర్వో,విఆర్ఏ ల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో
విఆర్ఏలు,తిరుపతి,సురేష్,లింగం,భూమయ్య,
జమాలుద్దీన్,నర్సయ్య,తదితరులు పాల్గొన్నారు.