విఆర్వోల డిమాండ్లను వెంటనే నెరవేర్చాలి.బిజెపి పార్టీ డిమాండ్.
నేరేడుచర్ల( జనంసాక్షి )న్యూస్.సీఎం కేసిఆర్ అసెంబ్లీ సాక్షిగా వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీజేపీ,జిల్లా ఉపాధ్యక్షులు కొణతం లచ్చిరెడ్డి,మండల అధ్యక్షుడు, పార్ధన బోయిన విజయ్ కుమార్ అన్నారు.స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద విఆర్ఓ లో నిరవదిక దీక్షను మద్దతుగా బిజెపి పార్టీ పట్టణ,మండల నాయకులు ధర్నాలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మండల అధ్యక్షులు పార్తనబోయిన విజయకుమార్ యాదవ్ మాట్లాడుతూ నేరేడుచర్ల మండల తహసీల్దార్ ఆఫీస్ నందు నిరవధిక సమ్మె నిర్వహిస్తున్న వీఆర్ఏలకు మద్దతు తెలుపుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ వీఆర్ఏ లకు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని గ్రామస్థాయిలో ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటూ పనిచేస్తున్న వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలని 55 సంవత్సరాలు దాటిన వారికి వారసత్వ ఉద్యోగాలు కల్పించాలని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రమోషన్ ఇవ్వాలని, అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని లేనిచో రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఏలు ఉద్యమించి కేసీఆర్ మెడలు వంచి వారి న్యాయమైన కోరికలను సాధించుకునే వరకు వారి పోరాటం ఆగదని భారతీయ జనతా పార్టీ వారికి మద్దతుగా నిలుస్తుందని వీ ఆర్ ఏ లకు సంఘీభావం తెలియజేయడం జరిగినది.వారి డిమాండ్ల ను నెరవేర్చాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నియోజక వర్గ కో కన్వీనర్ బాల వెంకటేశ్వర్లు,టౌన్ ఉపాధ్యక్షులు ఉరిమిల్ల రామ్మూర్తి, జూలూరు అశోక్, మండల ప్రధాన కార్యదర్శిలు పగిడి శ్రీనివాస్, దిద్దకుంట్ల విజయ్ రెడ్డి, టౌన్ ప్రధానకార్యదర్శి కొనతం నాగిరెడ్డి, దళిత మోర్చా అధ్యక్షులు ఉప్పెళ్లి ప్రవీణ్ సీనియర్ నాయకులు దాసోజు రమణాచారి, మెట్టు మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Attachments area