వికలాంగుల బందు ఏర్పాటు చేసి ప్రతి వికలాంగునికి ఆర్థిక సాయం చేయాలి

వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆనంద్
వికారాబాద్ రూరల్ డిసెంబర్ 3 జనం సాక్షి
రాష్ట్ర ప్రభుత్వం మాదిరిగానే వికలాంగుల బందు ఏర్పాటు చేసి ప్రతి వికలాంగునికి ఆర్థిక సహాయం చేయాలని రాష్ట్ర వికలాంగుల పరిరక్షణ సమితి ఉపాధ్యక్షుడు ఆనంద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శనివారం అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం పురస్కరించుకుని వికారాబాద్ జిల్లా కేంద్రంలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికలాంగులందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించాలని ఆయన సూచించారు వికలాంగులకు ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ రెట్టింపు చేయాలని ప్రతి వికలాంగులకు అంత్యోదయ రేషన్ కార్డులు పంపిణీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగుల సంక్షేమాన్ని మరిచి తీరని న్యాయం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా శాఖ అధ్యక్షులు ఉరడి శ్యాం ప్రసాద్ రాష్ట్ర కార్యదర్శులు రాజు విజయ్ కుమార్ జిల్లా ఉపాధ్యక్షులు జమాలుద్దీన్ కేశవులు సుభాని తదితరులు పాల్గొన్నారు