వికలాంగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి -ఎన్పిఆర్డి జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఖాజా.

కురవి నవంబర్-12 : (జనం సాక్షి న్యూస్)

వికలాంగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఖాజా డిమాండ్ చేశారు.శనివారం కురవి మండలం సూధనపల్లి గ్రామంలో గ్రామ విస్తృత సమావేశం నీలం అశోక్ అధ్యక్షతన నిర్వహించారు.ఈ సమావేశంలో ఖాజా ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వం దళిత బంధులాగా వికలాంగుల పరిరక్షణకు వికలాంగుల బందు ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు అయినా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు,రేషన్ కార్డులు,అంత్యోదయ కార్డు,ఉపాధి ఉద్యోగ అవకాశాలలో 5 శాతం రిజర్వేషన్ల పద్ధతిలో అమలు చేయాలని, చట్టాలు ఉన్నప్పటికీ అధికారులు అమలు చేయడం లేదని వారు విమర్శించారు. డబ్బులు ఇచ్చిన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తున్నారని వికలాంగులు అద్దె కట్టలేని పేదలకు అందని ద్రాక్షల మారిందని అన్నారు. వికలాంగులకు 5 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ సమావేశం ఎన్.పి.ఆర్.డి మండల అధ్యక్షురాలు రడం గౌరమ్మ,ఇర్రి యాకయ్య, షేక్ పాషా, బైరి వీరన్న,ఉప్పలయ్య, వెంపటి ఎల్లయ్య,రొట్టెల లింగయ్య, వెంకన్న, కవిత, వెంపటి రామచంద్రు,నీలం అశోక్ తదితరులు పాల్గొన్నారు.