వికలాంగ ప్రజాప్రతినిధికి అవమానం
జనం సాక్షి, వంగూర్:
మండల పరిధిలోని అన్నారం గ్రామపంచాయతీలో వికలాంగుడైన ప్రజాప్రతినిధి దార్ల శ్రీనివాసుకు అవమానం జరిగింది. దార్ల శ్రీనివాసులు ఎన్.పిఆర్.డి. వికలాంగుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులుగా, రాష్ట్ర కమిటీ మెంబర్ గా పని చేస్తున్నారు. అన్నారం గ్రామంలో నాలుగవ వార్డు మెంబర్ గా పనిచేస్తున్నారు. శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం, అన్నారం గ్రామంలో మంగళవారం కొత్త ఆసరా పెన్షన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్ళిన శ్రీనువాసులును గ్రామపంచాయతీ అధికారులు, సర్పంచ్ వేదిక పైకి ఆహ్వానించలేదు. మాట్లాడడానికి ప్రయత్నించిన అవకాశం ఇవ్వలేదు. కార్యక్రమం చివరిలో గ్రూప్ ఫోటో దిగే సమయంలో బలవంతంగా ఆయనను తీసుకువెళ్లి ఫోటో తీసుకున్నారు. వార్డు సభ్యుడినైన తనకు కార్డులు పంచే అవకాశం ఇవ్వలేదని, మాట్లాడే అవకాశం కల్పించలేదని శ్రీనివాసులు వాపోయారు. సర్పంచ్, గ్రామపంచాయతీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని అన్నారు. వికలాంగులను అణచివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Attachments area