వికసిత్‌ భారత్‌ కోసం ప్రణాళిక బద్ధంగా కృషిచేద్దాం

` వేగంగా అనుమతులు లభిస్తేనే పురోగతి సాధ్యం
` కేంద్రం నిర్దేశించిన లక్ష్యంలో మేమూ భాగస్వామ్యం
` 30 ట్రిలియన్‌ డాలర్ల ఎకానవిూలో 10శాతం ఉంటాం
` ఫ్యూచర్‌ సిటీ, ట్రిపుల్‌ ఆర్‌, మూసీ రివర్‌ ఫ్రంట్‌తో మార్పు
` పట్టణాభివృద్ధి మంత్రుల ప్రాంతీయ సమావేశంలో రేవంత్‌ రెడ్డి
` గుజరాత్‌కు మోదీ ఇచ్చిన సహకారాన్నే తామూ కోరుతున్నామని వెల్లడి
హైదరాబాద్‌(జనంసాక్షి): హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడంతో పాటు కొత్త నగరాన్ని నిర్మించాలని భావిస్తున్నట్లు సిఎం రేవంత రెడ్డి వెల్లడిరచారు. ఫ్యూచర్‌ సిటీకి ప్రణాళికలు సిద్దం చేశామని అన్నారు. తెలంగాణ రైజింగ్‌`2047 పేరుతో కొత్త ప్రణాళిక రూపొందించాం. ప్రపంచంలోనే ఆర్థికంగా ఎదిగిన దేశంగా భారత్‌ను అభివృద్ధి చేసేందుకు కేంద్రం కృషి చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాల్లో తెలంగాణ కూడా భాగమవుతుందన్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాజెక్టులకు కేంద్రం త్వరగా అనుమతులు మంజూరు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు లభిస్తే హైదరాబాద్‌ అభివృద్ధి చెందుతుందని.. తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థలో మరింత కీలకంగా మారుతుందని చెప్పారు. హోటల్‌ ఐటీసీ కోహినూర్‌లో నైరుతి రాష్టాల్ర పట్టణాభివృద్ధి మంత్రుల ప్రాంతీయ సమావేశంలో సీఎం మాట్లాడారు. రాష్టాల్రకు కేంద్రం సహకరిస్తే దేశాభివృద్ధి మరింత వేగవంతమవుతుంది. కేంద్రం నిర్దేశించుకున్న 30 ట్రిలియన్‌ డాలర్ల ఎకానవిూలో రాష్ట్ర వాటా 10 శాతం ఉండాలని భావిస్తున్నట్లు ఈ సందర్భంగా సిఎం వెల్లడిరచారు. జీడీపీలో ప్రధానంగా 5 మెట్రోపాలిటన్‌ నగరాలైన దిల్లీ, ముంబయి, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ దేశానికి ఎంతో కీలకంగా ఉన్నాయి. కేంద్రం సహకరించకుంటే రాష్టాల్ర అభివృద్ధి కుంటుపడుతుందని అన్నారు. హైదరాబాద్‌ మెట్రో రైలు, ఆర్‌ఆర్‌ఆర్‌, మూసీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించాల్సి ఉందన్నారు దేశానికి పెద్దన్నగా ఉన్న ప్రధాని మోదీ సహకరిస్తే అన్ని రాష్టాల్రు అభివృద్ధి చెందుతాయి. మోదీ గుజరాత్‌ మోడల్‌ రూపొందించుకున్నట్లే మేం తెలంగాణ మోడల్‌ తీసుకొచ్చాం. ఆయన సబర్మతి నది ప్రక్షాళన చేపట్టినట్లే మేం మూసీ పునరుజ్జీవం చేస్తున్నాం. గుజరాత్‌కు మోదీ ఇచ్చిన సహకారాన్నే మేం తెలంగాణకు కోరుతున్నాం అని వివరించారు. ఎన్నికలు ఉన్నప్పుడు మాత్రమే రాజకీయాలు చేద్దాం అని రేవంత్‌రెడ్డి అన్నారు. తరవాత అభివృద్ది గురించే మాట్లాడుతామని అన్నారు. అభివృద్దిలో దూసుకు వెళ్లాలలన్నదే తమ అభిమతమని అన్నారు. మా పోటీ ఇతర రాష్టాల్రతో కాదని, టోక్యో, సింగపూర్‌ లాంటి వాటితోనని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌, ఏపీ మంత్రి పొంగూరు నారాయణ, గుజరాత్‌ మంత్రి కనుభాయ్‌ మోహన్‌లాల్‌ దేశాయ్‌ తదితరులు పాల్గొన్నారు.