వికారాబాద్‌లో ముఖ్యమంత్రికి తెలంగాణ సెగ
రంగారెడ్డి : వికారాబాద్‌లో ఇందిరమ్మబాట కార్యక్రమంలో పాల్గొన్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ సెగ తగిలింది.ఆయన పాల్గొన్న ఇందిరమ్మబాట కార్యక్రమంలో తెలంగాణ వాదులు జైతెలంగాణ నినాదాలతో నిరసన తెలియజేశారు. ఆయన ప్రసంగాన్ని తెలంగాణ వాదులు అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీఛార్జీ చేశారు.పలువురు తెలంగాణ వాదులను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.