విజయారావుపై నెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలి
ఎంప్లాయిస్ యూనియన్ డిమాండ్
కందుకూరు, జూలై 18: ఎంప్లాయిస్ యూనియన్ రీజనల్ సెక్రటరీ విజయారావు మరికొంతమంది యూనియన్ నాయకులపై ఆర్టీసి యాజమాన్యం పెట్టిన అక్రమ కేసులు బేషరతుగా ఎత్తివేయాలని ఎంప్లాయిస్ యూనియన్ స్థానిక డిపో కార్యదర్శి రామ్మూర్తి డిమాండ్ చేశారు. బుధవారం విజయారావు యూనియన్ నాయకులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక ఇయు ఆధ్వర్యంలో ఆర్టీసి గ్యారేజీ ముందు ధర్నా కార్యక్రమం జరిగింది. ధర్నా కార్యక్రమంలో రామ్మూర్తి మాట్లాడుతూ చీరాల డిపోకు చెందిన కండెక్టర్‌పై స్క్వాడ్ అధికారి పెట్టిన అక్రమ కేసుల విషయంపై మాట్లాడటానికి వెళ్లిన విజయారావు, యూనియన్ నాయకులపై ఉద్దేశపూర్వకంగా ఆర్టీసి యాజమాన్యం అక్రమ కేసులు పెట్టించిందని అన్నారు. కార్మిక సమస్యలు అన్యాయాలపై ప్రశ్నించడమే నాయకులు చేసిన తప్ప అని వారన్నారు. విజయారావుపై పెట్టిన కేసులను ఉపసంహరించకుంటే కార్మికులతో కలిసి భారీ ఉద్యమం నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఆదినారాయణ, జివి రావు, శివయ్య, మాధవరావు, బాబురావు తదితరులు మాట్లాడారు. ధర్నా కార్యక్రమానికి భారీ సంఖ్యలో కార్మికులు హాజరయ్యారు.