విజిలెన్స్ అధికారులు సమన్వయం తో పని చేయాలి.

జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
నల్గొండ బ్యూరో. జనం సాక్షి
జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ సమావేశం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆధ్వర్యంలో కలెక్టరేట్ కాన్ఫెరెన్స్ హాల్ లో నిర్వహించడం అరిగింది.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కొత్తగా ఎన్నికైన సభ్యులకు స్వాగతం పలుకుతూ మాట్లాడుతూ సమావేశాని ప్రతి 3 నెలలకు ఒకసారి నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని, కమిటీ సభ్యులకు ఎప్పటికప్పుడు సమాచారం అందజేయడం జరుగుతుందని, కమిటీ సభ్యులు, పోలీస్ సంబందిత అధికారుల సమన్వయంతో కేసులను త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణ రెడ్డి మాట్లాడుతూ గ్రామాలలో నిరక్షరాస్యత కరాణంగా చట్టాల పై ప్రజలకు అవగాహన లేదని, దీనిపై ప్రజలకు అవగాహన కల్పించ వలసిన అవసరమున్నదని ఆయన అన్నారు. ఈ సమావేశo లో ఎస్సీ ,ఎస్టీ , ఎట్రాసిటీ కేసుల పై కమిటీ సభ్యులు డివిజన్ వారీగా రివ్యూ చేయడం జరిగింది. ప్రతి నెల పౌర హక్కుల దినం నిర్వహించాలని సమావేశంలో తీర్మానించారు. అనంతరం ఎస్సీ , ఎస్టీ ల పై అత్యాచారాల నిరోధానికై జాతీయ హెల్ప్ లైన్ నెం:14566 అనే పోస్టర్ ను కమిటీ సభ్యులందరూ కలిసి ఆవిష్కరించారు. ఈ సమావేశంలో జడ్పీ ఛైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, జిల్లా ఎస్సీ డెవెలప్మెంట్ అధికారి యం.జైపాల్ రెడ్డి, చౌటుప్పల్ ఆర్‌డి‌ఓ సూరజ్ కుమార్, ఇడి ఎస్సీ కార్పొరేషన్ శ్యామ్ సుంధర్, జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ , ఏసీపీ భువనగిరి , ఏసీపీ చౌటుప్పల్, నాన్ అఫిషియల్ సభ్యులు బి.సుదర్శన్, కె.నర్సింగ రావు. యస్ శివలింగం, డి.తిరుమలేష్, రాజన్ నాయక్, యస్ భాస్కర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు