విదేశీ విద్య అభ్యసనకు మరో ముందు అడుగు..
– సిద్దిపేట ప్రభుత్వ డిగ్రి కళాశాలలోని MCHRD హాల్ లో ఓరియంటెషన్ తరగతులు ప్రారంభం
– విదేశీ విద్యకు చక్కటి అవకాశం.
– త్వరలోనే ఉచిత శిక్షణ , వీసా ప్రాసెసింగ్
– మంత్రి క్యాంప్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు ఈ నెల 9న హాజరుకాగలరు…
– సిద్దిపేట నియోజకవర్గ విద్యార్థులు సద్వినియోగం చేసుకోగలరు.
– మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పాల సాయిరాం.
సిద్దిపేట బ్యూరో 06,జూన్ ( జనం సాక్షి )
విదేశాల్లో విద్యను అభ్యసించాలనుకునే సిద్దిపేట నియోజకవర్గ విద్యార్థిని విద్యార్థుల కోసం ఉచిత శిక్షణ , ప్రాసెసింగ్ ఏర్పాటు చేయనున్నట్లు ఇటీవల మంత్రి హరీష్ రావు ప్రకటించారని.. ఈ సందర్భంగా సిద్దిపేట ప్రభుత్వ డిగ్రి కళాశాల లోని మర్రి చెన్నా రెడ్డి శిక్షణ కేంద్ర భవన్ (MCHRD) లో అందుకు మరో ముందు అడుగు పడిందని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పాల సాయి రాం అన్నారు.. సోమవారం రోజు Edu- cog సంస్థ వారు ఓరియెంటెషన్ తరగతులు ప్రారంభించారు. ఇటీవల మంత్రి క్యాంప్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న యువతి యువకులు ఈ నెల 9న హాజరుకావలన్నారు.సిద్దిపేట నియోజకవర్గంలోని 2020 – 21 సం. లో డిగ్రీ , బి టెక్ పూర్తి చేసి విదేశీ వెళ్లి ఉన్నత చదువు లు చదువుకోవాలని ఆసక్తి ఉండే వారికి GRE , TOEFL తదితర పరీక్షలకు శిక్షణ మరియు వీసా ప్రాసెసింగ్ పూర్తి ఉచితంగా అందజేస్తున్నట్లు చెప్పారు. Edu-cog ఒప్పించి సిద్దిపేట విద్యార్థుకు విదేశీ ఉన్నత విద్యకు ప్రోత్సాహిస్తున్నట్లు చెప్పారు.ఈ సంస్థ ఆసక్తి అర్హత కలిగిన విద్యార్థిని విద్యార్థులకు మన సిద్దిపేట లోనే ఉచితంగా వారికి కావాల్సిన శిక్షణ ఇచ్చి , వారు అనుకున్న కోర్స్ లో ప్రవేశం పొందే వరకు అన్ని రకాల శిక్షణ , దిశానిర్దేశం ఉచితంగానే అందిస్తామని చెప్పారు..ఈ సౌకర్యం ఈ గొప్ప అవకాశం సిద్దిపేట విద్యార్థిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోగలరు అని తెలిపారు.. ఇటీవల మంత్రి క్యాంప్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్న వారు వెంటనే ప్రభుత్వ డిగ్రి కళాశాల లోని MCHRD లో శిక్షణ కు హాజరుకావలన్నారు.. అదేవిధంగా ధరఖాస్తు చేసుకోకున్నా ఆసక్తి కలవారు నేరుగా శిక్షణ కు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోగలరని చెప్పారు.మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పాల సాయిరాం9494999666 ని సంప్రదించగలరు .ఈ కార్యక్రమంలో డిగ్రి కళాశాల అధ్యాపకులు గోపాల సుదర్శన్ , హుస్సేన్ , అయోధ్య రెడ్డి edu – cog ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు..
– విదేశీ ఉన్నత విద్యకు మంత్రి హరీష్ రావు గొప్ప ఔదార్యం..
– విదేశాల్లో చదువాలని కోరిక.. ఆర్థిక స్తోమత అడ్డు..
– అలాంటి వారికి మంత్రి హరీష్ రావు భరోసా..నూతన ఒరవడి కి శ్రీకారం చుట్టిన మంత్రి హరీష్ రావు..
మంత్రి హరీష్ రావు పేరు చెప్పగానే గుర్తు వచ్చేది భరోసా.. సహాయం అలాంటి మంత్రి సిద్దిపేట విద్యార్థులకు విదేశీ ఉన్నత చదువులు చదివించాలే అనే తపన మంత్రి హరీష్ రావు ఎన్నో ఏళ్ల కల నిజం కాబోతోంది. డిగ్రీ , ఇంజనీరింగ్ పూర్తి చేసి విదేశీ వెళ్లి చదవాలి అనే తపన ఉన్నపట్టి కి ఆర్థిక ఇబ్బందులు ఒక వైపు, సరియైన శిక్షణ లేక , వీసా ప్రాసెసింగ్ లో తప్పిదాల వలన వారి కల నేర వేర లేకపోతుంది అలాంటి వారి కలను నిజం చేయాలి, వారు ఉన్నత విద్య చదివి ఉన్నత స్థాయిలో నిలవాలి అని మంత్రి హరీష్ రావు ప్రత్యేక చొరవ చూపుతున్నారు.. edu – cog అనే సంస్థను ఒప్పించి శిక్షణ , వీసా ప్రాసెసింగ్ అన్ని ఫ్రీ గానే ఇప్పియనున్నారు…రాష్ట్రంలో నే ఒక ఎమ్మెల్యే ,ఒక నాయకుడు ఇలాంటి గొప్ప కార్యక్రమం పూనుకోవడం సిద్దిపేట నియోజకవర్గ విద్యార్థులకు గోప్ప అదృష్టం ఈ లాంటి గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.. ఇలాంటి గొప్ప కార్యక్రమానికి శ్రీకారం శ్రీకారం చుట్టి మంత్రి హరీష్ రావు మరో సారి తన ఔదార్యం , మానవత్వానికి నిదర్శనం.