విదేశీ సంస్థల కమీషన్ల కోసం, భూస్వాముల ప్రయోజనాలు కాపాడుటకు ధరణి ఫోర్టల్ పుట్టుక

వనపర్తి జులై 6 (జనం సాక్షి) ధరణి సమస్యల పరిస్కారం కోసం రెవెన్యూ సదస్సులు అనేవి దొంగతనం చేసినోడే  ఓదార్చినట్టు ఉందనీ, మరోసారి ప్రజలను మభ్యపెట్టేందుకు ఈ రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేశారని టిడిపి అధ్యక్షులు నందిమల్ల అశోక్ తెలిపారు.మంత్రుల సబ్ కమిటీ ఏమి సాధించిందో ప్రజలకు చెప్పాలనీ అన్నారు. ఈ ధరణి సమస్యలు ఎన్ని సదస్సులు పెట్టినా పరిస్కారం కావని కె.సి.ఆర్, కె.టి.ఆర్ గార్లకు పూర్తిగా తెలుసు ఎందుకంటే ఈ వ్యవస్థను దురుద్దేశముతో కమీషన్ల కోసం,భూస్వాముల ప్రయోజనాలకోసం ఏర్పాటు చేసింది కాబట్టి ధరణి ఫోర్టల్ వ్యవస్థ వల్ల ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత కలిపించడం లో ప్రతిపక్షాలు ప్రజా సంఘాలు సఫలీకృతం అయినందుకు దీన్ని మరిపించడానికి కంటి తుడుపు చర్య తప్పా దీనివల్ల ఎటువంటి పరిష్కారాలు జగకపోగా మరిన్ని తగవులు పెరుగుతాయన్నరు. ఇంకా ధరణి ఫోర్టల్ గూర్చి చెప్పాలంటే ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం మన ఊరు మన బడి, తెలంగాణ క్రీడా ప్రాంగణాలు కమీషన్ల కోసం మేఘా కృష్ణరెడ్డి కంపెనీకి అప్పజెప్పారో అదేవిధముగా ధరణి ఫోర్టల్  వందల కోట్ల కమీషన్ల కోసం ఫిలిప్పీన్స్ దేశానికి సంబంధించిన కంపెనీ టెర్రయిస్ అనే కంపెనీకి అప్పజెప్పి సమూలమైన మార్పులు తెస్తామని 1952నుండి ఉన్న రికార్డులను మాయం చేసి భూస్వాముల ప్రయోజనాలు కె.సి.ఆర్, కె.టి.ఆర్ కాపాడినారు.మన రాష్ట్రములో 1994నుండి ప్రపంచములోనే పెరిన్నికగల టి సి ఎస్, మైక్రోసాఫ్ట్, విప్రో, ఇన్ఫోసిస్ కంపెనీలు వుండాగా ఒక లక్ష కోట్లు బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టిన టెర్రయిస్ కంపెనీకి ఒక కోటి యాభై లక్షల భూములు ఈ అవగాహన లేని కంపెనీకి ఇవ్వడమువల్ల 50లక్షల భూములు వివాదంలో ఉన్నాయి,24లక్షల ఎకరాల అసైన్డ్ భూములను ఈ సాఫ్టువెర్ చూపుతాలేదు.వీటికి సంబంధించిన లక్షల దరఖాస్తులు రెవెన్యూ కార్యాలయాలలో రెండు ఏండ్లుగా పెండింగులో ఉన్నాయి. ఈ ధరణి వల్ల రికార్డ్ మొత్తం మాయం చేసి ఈ ప్రభుత్వం రాజ్యాంగ హక్కులను కాలరాస్తుంది. దీనితో బాటు మన ఆస్తుల వివరాల్ని విదేశాలకు అప్పజెప్పారు మన ముఖ్యమంత్రి. కాబట్టి మాయమాటలు కట్టిపెట్టి వెంటనే ధరణి ఫోర్టల్ రద్దు చేసి రికార్డుల ప్రకారం వివాదాలు పరిష్కరించాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుందనీ వారు తెలిపారు.