విద్యాభివృద్ధి లో స్వర్ణ భారతి ట్రస్ట్ సేవలు అభినందనీయం
దాతల అందించే సౌకర్యాలు సద్వినియోగం చేసుకోవాలీ; ఎస్సై సాయి ప్రశాంత్
కోదాడ టౌన్ ఆగస్టు 26 ( జనంసాక్షి )
విద్యాభివృద్ధి లో స్వర్ణ భారతి ట్రస్ట్ సేవలు అభినందనీయం అని గ్రామీణ ఎస్ఐ సాయి ప్రశాంత్, మండల విద్యాధికారి సలీమ్ షరీఫ్ అన్నారు. శుక్రవారం కోదాడ మండల పరిధిలోని లక్ష్మీ పురం ప్రాధమిక పాఠశాల విద్యార్థులకు స్వర్ణ భారతి ట్రస్ట్ ఆధ్వర్యం లో కోదాడ మండల తహశీల్దార్ జే.శ్రీనివాస శర్మ ఆర్థిక సౌజన్యం తో ఏర్పాటు చేసిన నోటు పుస్తకాలు విద్యార్థులకు పంపిణీ చేసి మాట్లాడారు
దాతల సహాకారంతో ఏర్పాటు చేసిన సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.ప్రాధమిక స్థాయి నుండే విద్యార్థులు ఉన్నత లక్ష్యాలకు చేరుకోవాల
న్నారు.ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ లింగయ్య, ప్రధానోపాధ్యాయులు సనత్ కుమార్,స్వర్ణ భారతి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు గాదం శెట్టి శ్రీనివాసరావు,జాయింట్ సెక్రటరీ యాదా సుధాకర్,జాయింట్ సెక్రటరీ రంగా ముత్తేశ్వర రావు, ట్రస్ట్ సభ్యులు పుల్ల ఖండం సాంబశివరావు, వుప్పలవంచు అశోక్,రేపాల వెంకటేశ్వర్లు,తదితరులు పాల్గొన్నారు.
![]()
|