విద్యారంగాన్ని విస్మరిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు

 ఏఐఎస్ఎఫ్ జిల్లా కోశాధికారి ప్రేమ్ కుమార్
చేర్యాల (జనంసాక్షి) నవంబర్ 15 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగాన్ని పూర్తిగా స్మరిస్తున్నాయని ఏఐఎస్ఎఫ్ సిద్దిపేట జిల్లా కోశాధికారి బంగారు ప్రేమ్ కుమార్ అన్నారు. మంగళవారం వివిధ కళాశాలలో జరిగిన సమావేశంలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగాన్ని పూర్తిగా విస్మరిస్తూ విద్యను వ్యాపారంగా మారుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్ షీప్ లు విడుదల చేయకుండా కాలయాపన చేస్తూ కాలం వెల్లదీస్తుందని దాంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. విద్యారంగం పట్ల ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ భవిష్యత్తులో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని వారు తెలిపారు. ఈకార్యక్రమంలో సంధ్య, వాణి శ్రీ, ఉష, రజిత తదితరులు పాల్గొన్నారు.