విద్యార్థినికి లాప్టాప్ అందజేత

 

వరంగల్ ఈస్ట్, నవంబర్ 12(జనం సాక్షి)

 

లయన్స్ క్లబ్ ఆఫ్ వరంగల్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో జాతీయ విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిఖిత అనే విద్యార్థినికి అవసరం నిమిత్తం 50,000/- రూ. విలువగల   లాప్టాప్ అందజేశారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు అప్పరాజు రాజు మాట్లాడుతూ మాస్పోర్ట్స్ క్లబ్ ద్వారా ఎంతో మంది పేద విద్యార్థులకు సహకారాన్ని అందజేస్తున్నామని అవకాశాన్ని ఉపయోగించుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు అప్పరాజు రాజు, కార్యదర్శి మాడిశెట్టి నరహరి, కోశాధికారి గుండేటి రమణయ్య, రీజియన్ సెక్రెటరీ పోశాల సురేందర్, పి జెడ్ సి ఇమ్మిడిశెట్టి కోదండపాణి, ఉపాధ్యక్షుడు రావుల భాను,తులసి పవార్,డా.నవీన్, రాజు తదితరులు పాల్గొన్నారు.