విద్యార్థినులకు ఇచ్చిన హామీని నెరవేర్చిన జిల్లా కలెక్టర్..
ముగ్గురికి సైకిళ్ల అందజేత
యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి
విద్యార్థినిలు కాలినడకన పాఠశాలలో పాఠశాలకు వెళ్లడాన్ని చూసి వారికి సైకిళ్లను అందజేస్తానని ఇచ్చిన మాట నిలుపుకున్నారు . యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి.. .
గత సంవత్సరం నవంబర్ 30 వ తేదీన గౌస్ నగర్ కు చెందిన ఎన్. స్పూర్తి, వి.రేవతి, పి.హారిక అనే ముగ్గురు విద్యార్థినులు గౌస్ నగర్ నుండి బండసోమారం జిల్లా పరిషత్ హై స్కూల్ కు నడుచుకుంటూ వెళుతున్నప్పుడు జిల్లా కలెక్టర్ మార్గమధ్యంలో వారిని గమనించి పలకరించారు. మూడు కిలోమీటర్లు నడిచి వెళ్తున్న విద్యార్థినుల అవస్థ చూసి సైకిల్స్ మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.అనాడు ఇచ్చిన హామీ మేరకు జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ద్వారా మంజూరైన సైకిళ్లను సోమవారం నాడు కలెక్టరేట్ కార్యాలయంలో ఆమె ముగ్గురు విద్యార్థినులకు బహూకరించారు. బాగా చదువుకొని ఉన్నత స్థానానికి ఎదగాలని వారిని ఆశీర్వదించారు.
కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఎం. ఉపేందర్ రెడ్డి, బండ సోమారం జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు విజయేందర్ రెడ్డి, తెలుగు పండిట్ బాలయ్య పాల్గొన్నారు.