విద్యార్థి పరిస్థితి విషమం – విద్యార్థిసంఘాల ధర్నా
వరంగల్ ఎంజీఎం: ఈ రోజు ఉదయం తెలంగాణ ఏర్పాటు చేయాలంటూ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన ఇంజినీరింగ్ విద్యార్థి ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. విద్యార్థి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. ఆసుపత్రి ఎదుట ఏబీవీపీ, టీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. తెలంగాణ మంత్రులు రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం ర్యాలీగా బస్వరాజు సారయ్య ఇంటి ముట్టడికి బయలుదేరారు. పోలీసులు అనుమతించకపోవడంతో పోలీసు వాహనాలపై దాడులు నిర్వహించారు. దీంతో నాయకులను పోలీసులను అరెస్టు చేశారు.