విద్యార్థులకు కనీస సామర్ధ్యాలు వచ్చే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలి

: బీరెల్లి శ్రీనివాసరెడ్డి
హుజూర్ నగర్ సెప్టెంబర్ 21(జనం సాక్షి): ప్రతి విద్యార్థికి కనీస సామర్ధ్యాలు వచ్చే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని
ఎఫ్ ఎల్ ఎన్ మండల నోడల్ అధికారి బీరెల్లి శ్రీనివాసరెడ్డి అన్నారు. హుజూర్ నగర్ మండల పరిధిలోని శ్రీనివాసపురం గ్రామంలోని యుపిఎస్ పాఠశాలను బుధవారం తొలిమెట్టు కార్యక్రమంలో భాగంగా ఎఫ్ ఎల్ ఎన్ నోడల్ అధికారి బీరెల్లి శ్రీనివాసరెడ్డి, విషయ నిపుణ రిసోర్స్ పర్సన్ ముక్కా సోమశేఖర్, సిఆర్పి రమేష్ లు సందర్శించారు. అనంతరం పాఠశాలలోని పిల్లలకు ప్రాథమిక పరీక్షలు నిర్వహించి వారి సామర్థ్యాలను పరీక్షించారు. అనంతరం నోడల్ అధికారి మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థికి కనీస సామర్ధ్యాలు వచ్చే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. పాఠశాల పట్ల గ్రామస్తుల సహకారం మరువలేనిది అన్నారు. పాఠశాల నిర్వహణ పట్ల, రికార్డులు పరంగా, విద్యార్థుల హాజరు పట్ల సంతృప్తి వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు చిక్కుల గోవింద్, రామ్మూర్తి, రవి కిషోర్, మాస్టర్ వేణు ఉన్నారు.