విద్యార్థులకు డ్రెస్సుల పంపిణీ కార్యక్రమం

చౌడాపూర్,అక్టోబర్ 10( జనం సాక్షి): వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండల కేంద్ర పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తిమ్య ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు నూతన డ్రెస్సులు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాఠశాల కమిటీ చైర్మన్ పుట్ట యాదయ్య,స్థానిక ఎంపిటిసి శంకర్,డిప్యూటీ సర్పంచ్ శివకుమార్,రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు యాదయ్య మరియు విద్యార్థిని,విద్యార్థులు పాఠశాల ఉపాధ్యాయులు,నరసింహులు,యాదయ్య వార్డ్ సభ్యులు రామకృష్ణ తదితరులు పాల్గొనడం జరిగింది.