విద్యార్థులకు దుస్తులు పంపిణీ.
మండలంలోని దిర్సించర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం ద్వారా అందిస్తున్న ఉచిత ఏక రూప దుస్తులను పాఠశాల ఎస్ఎంసి చైర్మెన్ వరాల కిరణ్మయిని చేతుల మీదుగా విద్యార్థులకు దుస్తులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బట్టు మధు,కట్టా మాధవి, ఉపాధ్యాయులు శ్రీదేవి,శ్రీనివాస్ రావు,అశోక్ కుమార్,యాదగిరి, సభియా,కృష్ణయ్య,సైదులు తదితరులు పాల్గొన్నారు.