విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి సీనియర్ సివిల్ జేడ్జ్ జి శ్రీనివాస్

మక్తల్ అక్టోబర్ 15 (జనంసాక్షి) విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి సీనియర్ సివిల్ జేడ్జ్ జి శ్రీనివాస్ అన్నారు.
శనివారం మద్యాహ్నం సినియర్ సివిల్ జేడ్జ్ జి శ్రీనివాస్ జిల్లా లోని మంగనూర్, మక్తల్, ఉట్కూర్,కృష్ణ మండలలో గల యస్సీ, బాలుర, బాలికల వసతి గృహం, KGBV, మక్తల్ లోని TSWRS వసతి గృహాలను తనిఖి నిర్వహించి విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని ఆదేశించారు. వసతి గృహాలలో ఉండే విద్యార్థులకు నాణ్యమైన శిక్షణతో పాటు నాణ్యమైన భోజనాన్ని అందించే భాత్యత తమదేనని విద్యార్థులు తమ తల్లి దండ్రులకు దూరంగా ఉంది విద్యనూ అబ్యాసించడానికి వస్తారు కాబట్టి వారికీ ప్రభుత్వం అందిచే అన్ని సదుపాయాలను వారికి అన్దేజేయాలని నిర్వాహకులకు తెలిపారు. అదేవిదంగా వసతి గృహాలలో పరిశుబ్రతలను పాటించాలని విద్యార్థులు అనారోగ్యానికి గురికాకుండా చూడాలని పేర్కొన్నారు. హాస్టల్స్ లో తప్పని సరిగా భోజనని కి సంబందించిన రోజు వారి మెనూ  సూచిక బోర్డు ను ఏర్పాటు చేయాలనీ ఆదేశించారు.