విద్యార్థులకు నోటుబుక్కులు, పెన్నులు పంపిణీ.

ఫోటో రైటప్: నోటుబుక్కులు పంపిణీ చేస్తున్న సర్పంచ్ తిరుపతి రెడ్డి.
బెల్లంపల్లి, ఆగస్టు15, (జనంసాక్షి)
బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండలం కోణంపేట గ్రామంలో సోమవారం రాంటెంకి శివరాం జ్ఞాపకర్థం అతని కూతురు రాంటెంకి మమత ప్రైమరీ పాఠశాల విద్యార్థులకు నోటుబుక్కులు, పెన్నులు, పెన్సిళ్లు, ఏరేజర్లు, చార్టులు స్థానిక సర్పంచ్ తిరుపతి రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఈసందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల కోసం ఉచితంగా నోటుబుక్కులు, పెన్నులు, ఇతర సామగ్రి అందజేయడం అభినందనీయమని అన్నారు. రాంటెంకి శివరాం మరణించి అయిదు సంవత్సరాలు గడిచిన ఆయన కుటుంబ చేస్తున్న ఇలాంటి కార్యక్రమాల ద్వారా చిరస్మరణీయంగా ఉన్నాడని పేర్కొన్నారు. ఈసందర్భంగా దాత రాంటెంకి మమత మాట్లాడుతూ మాకు చిన్నతనంలో ఎదురైన పేదరిక సమస్యలు ఎవరికి ఎదురుకావద్దనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. బాల్యం అనేది ఒక అద్భుతమైన మరుపురాని అనుభూతి అని బాల్యంలో విద్యార్థులకు నోటుబుక్కులు, పెన్నులు లేక బడి మనేయకుండా ఉండటానికి తమ వంతు చిన్న ప్రయత్నం అన్నారు. ఈకార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రావణి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజన్న, దాత కుటుంబ సభ్యులు శ్రీనివాస్, వంశీకృష్ణ, సాయి,నాయకులు కంకణాల బాపురెడ్డి, కోడిపే శంకర్, పెరుగు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

అన్న బాటలో చెల్లి
పుట్టిన గ్రామానికి ఎన్నో సేవలు చెయ్యాలని తలచిన యువకుడు రాంటెంకి. శ్రీనివాస్ జర్నలిజం విద్యార్థి, చదువుల రిత్యా బయటకు వెళ్ళినప్పుడు నా కర్తవ్యాన్ని మా చెల్లి మమత తాను నా ఆశయంలో నేనున్నా నంటూ నాకు ఎంతో సపోర్ట్ చేస్తుంది kpl ఫౌండేషన్ ద్వారా ఉపాధ్యాయులు కల్పించిన అవకాశం తో తాను చదివిన పాఠశాలలో, తనకు చదువు చెప్పిన గురువులతో ఇవ్వాళ సొంత గ్రామంలో విద్యార్థులకు పాఠాలు బోధించడం చాలా గర్వకారణంగా ఉంది మా నాన్న గారి 5సంవత్సరాల జ్ఞాపకార్థం గా మేము చిన్న నాడు చదివిన పాఠశాలలో ఉన్న ప్రస్తుత చిన్న పిల్లలకు మాకు చిన్న నాడు ఎదురైన పేదరిక సమస్యలను ఛేదించినం మా లాగే మరి కొంత మంది విద్యార్థులు అలా ఫీల్ కావద్దు బాల్యం అనేది ఒక అధ్బుతమైన మరుపు రాని రోజులు కాబట్టి మా వంతుగా చిరు కానుకగా కోనంపేట ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఉచిత నోట్ బుక్స్, పెన్సిల్స్,పెన్నులు,ఎరేసర్ లు,చాట్ లు సర్పంచ్ తిరుపతి రెడ్డి,కార్యదర్శి శ్రావణి,HM రాజన్న చేతుల మీదుగా పంపిణీ చేశారు కార్యక్రమంలో కుటుంబ సభ్యులు మమత,వంశీకృష్ణ, సాయి తదితరులు పాల్గొన్నారు …………………ఇట్లు కుటుంబ సభ్యులు