విద్యార్థులకు పాఠ్య పుస్తకాల పంపిణీ

ఏర్గట్ల జూలై 19 ( జనంసాక్షి): నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని  గుమ్మిర్యాల్  గ్రామంలోనీ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం రోజున విద్యార్థినీ విద్యార్థులకు ప్రభుత్వం సరఫరా చేసిన పాఠ్యపుస్తకములను పిఆర్టీయు  అసొసియేటెడ్ అధ్యక్షుడు రాజారపు భాస్కర్ పంపిణీ చేశారు. అలాగే విద్యార్థిని, విద్యార్థులకు ప్రతిరోజు స్కూలుకు హాజరుకావాలని, అలాగే తల్లిదండ్రులు కూడా విద్యార్థులు ప్రతిరోజూ స్కూల్ కు హాజరు అయ్యేటట్లు చూడాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ఇట్టి కార్యక్రమంలో శంకర్, గౌతమిలు పాల్గొన్నారు