విద్యార్థులచే మానవహారం 75వ, స్వతంత్ర భారత వజ్రోత్సవాలు ర్యాలీ
మల్లాపూర్ (జనం సాక్షి) ఆగస్టు: 13
స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా ఈరోజు సాతారం గ్రామపంచాయతీ వారి, సర్పంచ్ బొడ్డు సుమలత రాజేష్ గారి ఆధ్వర్యంలో ర్యాలీని స్వపాలన 75 సంవత్సరాలుగా మన దేశాన్ని మనం పాలించినందున ఈరోజు గర్వంగా భారత స్వతంత్ర 75వ స్వతంత్ర దినోత్సవాన్ని నిర్మించుకున్న సందర్భంగా 75 వ వజ్రోత్సవాలను త్రివర్ణ పథకాన్ని చేతిలో పట్టుకొని విద్యార్థులచే మానవహారంతో నిర్మించి భరతమాత విగ్రహం నుండి గ్రామపంచాయతీ కార్యాలయం వరకు ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గున్నాల శ్రీనివాస్ కార్యదర్శి వినోద్ కుమార్ ఉప సర్పంచ్ మెడకుల శ్రీనివాస్ ఆశా వర్కర్లు అంగన్వాడి టీచర్లు విద్యార్థులు విద్యార్థినిలు వార్డ్ స భ్యులు పాల్గొన్నారు