విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి

కౌన్సిలర్ కొంకటి నళిని దేవి
హుస్నాబాద్ రూరల్ సెప్టెంబర్ 21(జనంసాక్షి) విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వార్డ్ కౌన్సిలర్ కొంకటి నళిని దేవి అన్నారు.ఈ సందర్భంగా బుధవారం హుస్నాబాద్ కస్తూరిబాయ్ కాలనీ రాష్ట్ర ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ సహకారంతో విద్యార్థులకు మంజూరైన యూనిఫామ్ ను వార్డ్ కౌన్సిలర్ కొంకటి నళిని దేవి చేతుల మీదుగా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో ఉచిత పాఠ్యపుస్తకాలతో పాటు మధ్యాహ్న భోజనం, మరియు ఉచిత దుస్తుల పంపిణీ చేస్తున్నందున విద్యార్థులు సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కొండ ధనలక్ష్మి, గోవర్ధన్ రెడ్డి, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
Attachments area