విద్యార్థులు ఒక లక్ష్యాన్ని నిర్ధారించుకొని చదివితే జాతీయస్థాయిలో రాణించవచ్చు

గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 24 (జనం సాక్షి);
విద్యార్థులు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదివితే జాతీయ స్థాయిలో రాణించవచ్చని
శ్రీ వైష్ణవి రుజువు చేసిందని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. ఇటీవల నిర్వహించిన నీట్ ప్రవేశ పరీక్షలో గద్వాలకు చెందిన గౌని శ్రీ వైష్ణవి జాతీయస్థాయిలో 720 మార్కులకు గాను 656 మార్కులు సాధించి 3277వ జాతీయ ర్యాంకు, రాష్ట్రస్థాయిలో 129 వ ర్యాంకు సాధించింది.శనివారం జిల్లా కలెక్టర్ చాంబర్ లో జిల్లా కలెక్టర్ వైష్ణవి ని అభినందిస్తూ ఘనంగా సన్మానం చేసి పుస్తకం బహుకరించారు. ప్రతిభగల విద్యార్థులు నిరంతరం చదువుపైనే దృష్టి సారించాలని అన్నారు. గద్వాల నుండి జాతీయస్థాయి లో ర్యాంకు సాధించినందున శ్రీ వైష్ణవి ఆదర్శంగా నిలిచిందని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ శ్రీ హర్ష శ్రీ వైష్ణవి ని అభినందించారు.
ఈ కార్యక్రమంలో శ్రీ వైష్ణవి తల్లిదండ్రులు సునీత, విజయ మోహన్, శ్రీ వైష్ణవి తాత సీతారాములు, ఎంఈఓ సురేష్ తదితరులు పాల్గొన్నారు.