విద్యార్థులు జీవన నైపుణ్యాలు పెంపొందించుకోవాలి
– కేజీబీవీ ఎస్ఓ దేవి కిషన్
కుల్కచర్ల, జులై 29(జనం సాక్షి):
విద్యార్థులు విద్యతో పాటు జీవన నైపుణ్యాలు పెంపొందించుకోవాలని కేజీబీవీ ఎస్ఓ దేవికిషన్ అన్నారు.శుక్రవారం కుల్కచర్ల మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో విద్యార్థులకు జీవన నైపుణ్యాలు నేర్చుకునేందుకు బుక్స్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..విద్యార్థులు చిన్నతనం నుంచే నీతి నిజాయితీని అలవర్చుకోవాలని కోరారు.భాషా, వృత్తి, జీవన విధానం, సాంకేతికపరమైన నైపుణ్యాలు, మెలకువలు పెంపొందించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కస్తూర్బా గాంధీ పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.
Attachments area