విద్యార్థులు తమ హక్కులను తెలుసుకోవాలి

-సమాజంలో ఉన్నతంగా ఎదగాలి
-సమస్యలను1098 టోల్ ఫ్రీ కి తెలియజేయాలి
-బాలలు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి
-సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి
-సీడబ్ల్యూసీ చైర్ పర్సన్ అనిల్ చందర్ రావ్..
-కాళేశ్వరములో  డీసీపీయూ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు.

మహాదేవపూర్ (కాళేశ్వరం )ఆగస్టు 22 జనంసాక్షి న్యూస్ :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలో ని కాళేశ్వరం లో  డిసిపియూ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థులు తమ హక్కులను తెలుసుకోని వాటిని సక్రమంగా ఉపయోగించుకోవాలని సీడబ్ల్యూసీ చైర్ పర్సన్ అనిల్ చందర్ రావ్ అన్నారు. సోమవారం కాళేశ్వరంలోని ప్రభుత్వ ఉన్నత, గిరిజన ఆశ్రమ పాఠశాలలు, మహాదేవపూర్ లోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలల్లో జిల్లా బాలల పరిరక్షణ విభాగం  ఆధ్వర్యంలో విద్యార్థులకు ఏర్పాటు చేసిన బాలల సమస్యలు – సంబంధిత చట్టాలపై అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. బాలల హక్కుల రక్షణ కొరకు జిల్లాలో బాలల పరిరక్షణ విభాగం సమర్ధవంతంగా పని చేస్తుందని అన్నారు. బాలలు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. బాలలు పనిలో కాదు బడిలో ఉండాలని, బాల్య వివాహాలు, బాల కార్మికులు, బాలలపై లైంగిక వేధింపులు, అక్రమ దత్తత, నిరాధారణకు గురైన బాలలు, బడి మానేసిన బాలలు, అనాధ, వదిలివేయబడిన బాలల వివరాలను చైల్డ్ హెల్ప్ లైన్ 1098 కి అందించాలని అన్నారు. ఈ పోటీ ప్రపంచంలో  విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని, చదువులో రాణించి ఉన్నత శిక్షరాలను చేరుకోవాలని చైర్ పర్సన్ అన్నారు. ఈ కార్యక్రమంలో సీడబ్ల్యూసీ మెంబర్ దామోదర్, బాలల సంరక్షణ అధికారి వెంకటస్వామి, లీగల్ కమ్ ప్రొబేషన్ ఆఫీసర్ మొహినొద్ధిన్, సోషల్ వర్కర్ లింగరావు, ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మణిమాల, ఆశ్రమ పాఠశాల హెచ్ఎం అమల, కస్తూర్భా స్పెషల్ ఆఫీసర్ పుణ్యవతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.