విద్యార్థులు దేశభక్తి భావాలను పెంపొందించుకోవాలి
సూర్యాపేట టౌన్ (జనంసాక్షి): స్వాతంత్ర్య ఉద్యమం పట్ల విద్యార్థులు అవగాహన కలిగి ఉండి దేశభక్తి భావాలను పెంపొందించుకోవాలని డీఐఈఓ రుద్రంగి రవి , ఇంటర్ బోర్డ్ మాజీ కమిషనర్ చక్రపాణి అన్నారు.సోమవారం స్థానిక
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కళాశాల ప్రిన్సిపాల్ పెరుమాళ్ళ యాదయ్య అధ్యక్షతన 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు సమావేశంలో వారు పొల్గొని మాట్లాడారు.విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించడానికి ప్రణాళికబద్ధంగా నిరంతర సాధన కొనసాగించాలన్నారు.విద్యార్థులు కళాశాలలో లభించే పత్రికలు , వివిధ రకాల మ్యాగజైన్లను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.సివిల్ సర్వీసెస్ సన్నద్ధతకు అవగాహన తోడ్పాటును అందిస్తామన్నారు.అనంతరం వజ్రోత్సవాల్లో భాగంగా కళాశాలలో నిర్వహించిన వ్యాసరచన, పాటల పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు.కళాశాలలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు కళాశాల ప్రిన్సిపల్ పెరుమాళ్ళ యాదయ్య నగదు బహుమతిని అందించారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు సైదులు, లింగం , కవిత , వీరయ్య , శ్రీనివాస్ , ప్రవీణ్ , వసంతలక్ష్మి , బలభీమరావు , కృష్ణ , వెంకట్రాములు, నవీన్ కుమార్ , రమేష్ , లక్ష్మయ్య , రవీందర్, కుమార్, రాణి పున్నమ్మ, సంధ్య , పవన్ , ఆరిఫ్, సైదులు , చైతన్య , శ్యాంసుందర్ రెడ్డి , సతీష్ తదితరులు పాల్గొన్నారు.