విద్యార్థులు నిర్దిష్టమైన లక్ష్యాలతో ముందుకు వెళ్లాలి

జై నడిగడ్డ యువత ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు పంపిణీ

జై నడిగడ్డ యువత చీప్ కోఆర్డినేటర్ రామకృష్ణ

ఇటిక్యాల (జనంసాక్షి) ఆగస్టు 8 :

విద్యార్థులు పాఠశాల దశలోనే నిర్దిష్టమైన లక్ష్యాలతో ముందుకెళ్లాలని జై నడిగడ్డ యువత జోగులాంబ గద్వాల జిల్లా చీఫ్ కోఆర్డినేటర్ రామకృష్ణ అన్నారు. సోమవారం మానవపాడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జై నడిగడ్డ యువత వ్యవస్థాపకులు తెలంగాణ రాష్ట్ర మాజీ బిసి కమిషన్ సభ్యులు డాక్టర్ ఆంజనేయ గౌడ్ ఆదేశానుసారం ఉత్తమ విద్యార్థిని, విద్యార్థులకు మండల స్థాయి ప్రతిభా పురస్కారాలు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలో పదవ తరగతిలో ప్రతిభ కనబరిచి ఉత్తమ మార్కులు సాధించిన పాఠశాల స్థాయితో పాటు మండల స్థాయిలో విజేతలకు ప్రతిభ పురస్కారాలు అందచేసి మేమొంటో మరియు శాలువాతో ఘనంగా సన్మానించారు. జై నడిగడ్డ యువత మండల కమిటి ఆధ్వర్యంలో పాఠశాలకు రెండు ఫ్యాన్స్ వితరణ చేశారు. అనంతరం మానవపాడు ఎస్ఐ సంతోష్, జై నడిగడ్డ యువత జిల్లా కోఆర్డినేటర్ రామక్రిష్ణ, కంచుపాడు సర్పంచ్ శేషన్ గౌడ్, సంచార జాతుల రాష్ట్ర నాయకులు బొప్పల శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఏకాగ్రతతో చదువుకుని ఉన్నతంగా ఎదగాలని నడిగడ్డలోని విద్యార్థులకు జై నడిగడ్డ యువత వ్యవస్థాపకుడు డాక్టర్ ఆంజనేయ గౌడ్ విద్యాపరంగా సహయ సహకారాలు అందించడానికి ఎల్లప్పుడు సిద్ధంగా ఉన్నట్టలు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జై నడిగడ్డ జిల్లా సమన్వయకర్తలు కురువ వీరేష్, బోయ సత్యం, రామాంజనేయులు, గట్టన్న, మానవ పాడు మండల సమన్వయకర్తలు మధు, రియాజ్, అయిజ మండల సమన్వయకర్తలు రాఘవేంద్ర, అంజి, నరేష్, ఉపాధ్యాయుల తోపాటు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.