విద్యార్థులు నూతన ఆవిష్కరణలతో ముందుకు సాగాలి
బివిఆర్ ఐటీ కళాశాల్లొ ఘనంగా సిల్వర్ జుబ్లి ఉత్సవాలలు ప్రారంభించిన
విష్ణు విద్యాసంస్థల చైర్మన్ విష్ణు రాజు
నర్సాపూర్. అక్టోబర్, 12, ( జనం సాక్షి ) :
విద్యార్థులు నూతన ఆవిష్కరణలతో ముందుకు సాగాలని విష్ణు విద్యాసంస్థల చైర్మన్ విష్ణు రాజు అన్నారు. బుధవారం నాడు నర్సాపూర్ సమీపంలోని బివిఆర్ ఐటీ కళాశాలలో సిల్వర్ జుబ్లి వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో వివిధ పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా విష్ణు విద్యాసంస్థల చైర్మన్ విష్ణు రాజు మాట్లాడుతూ విద్యార్థులకు ఆసక్తి, అవసరాలు, నూతన ఆవిష్కరణలు, నెట్ వర్క్ థింకింగ్, సాంఘిక సమస్యలు వాటి పరిష్కారం, భాషా పరిజ్ఞానం వాటి ఆవష్యకత, సాంకేతిక శిక్షణ, భాష వ్యక్తికరణ వంటి పలు అంశాలపై విద్యార్థులు క్షుణంగా తెలుసుకోవాలని సూచించారు. అనంతరం హైదరాబాద్ ఈ ఎఫ్ ఎల్ యూ ఫ్రోఫెసర్ డాక్టర్ సుజాత మాట్లాడుతూ భాషలకు గల ప్రాధాన్యాన్ని విద్యార్థులు గమనించి ఆంగ్ల భాషా పరిజ్ఞానాన్ని అన్ని రంగాలలో పెంపోందించుకోవాలని కోరారు. అనంతరం కళాశాలలో డ్రామా పోటీలు, ఇంగ్లీషు పాఠల పోటీలు, స్టీట్ ప్లే, ఫోటో ఆల్బమ్ పరిచయం, భాషతత్వ పోటీలను నిర్వహించారు. గురువారం నాడు రక్తదాన శిభిరం నిర్వహించనున్నట్లు శుక్రవారం నాడు విద్యార్థులతో సంస్కతిక కార్యక్రమాలు, నూతన బ్లాక్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సాంకేతిక విద్యాసంస్థ మేనేజర్‌లు బాపిరాజు, అశోక్‌రెడ్డిలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.