విద్యార్థులు భవిష్యత్తు లక్ష్యాన్ని సాధించే విధంగా ఉండాలి

హుజూర్ నగర్ అక్టోబర్ 14 (జనం సాక్షి): విద్యార్థిని విద్యార్థులు భవిష్యత్తు లక్ష్యాన్ని సాధించే విధంగా ఉండాలని జిల్లా బాలల పరిరక్షణ విభాగ నుండి ప్రొటక్షన్ అధికారి షేక్. మీరా అన్నారు. హుజూర్ నగర్ లోని ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాల నందు బాల రక్ష భవన్ నుండి జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో కళాశాల బాలురులకు, బాలికలకు ఇంటర్ విద్యార్థి దశలో ఆలోచన విధానం విద్యార్థి పాత్ర పై అవగాహన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగ నుండి ప్రొటక్షన్ అధికారి షేక్. మీరా మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్క విద్యార్థి ఆలోచన విధానంలో మార్పు రావాలని, ప్రతిఒక్కరు భవిష్యత్తుపై లక్ష్యంతో చదువుకోవాలని ప్రతి విద్యార్థికి లక్ష్యం ఉండాలని, ప్రతి ఒక్కరు సమాజంలో ఉన్నత స్థాయిలో ఉండే విధంగా భవిష్యత్తు కార్యచరణ చేసుకోవాలన్నారు. తల్లిదండ్రుల మన మీద పెట్టుకున్న ఆశలు, నమ్మకాన్ని భవిష్యత్తు లక్ష్యాన్ని సాధించే విధంగా ఉండాలన్నారు. ఇంటర్మీడియట్ దశలో విద్యార్థి పూర్తిస్థాయిలో అన్ని అంశాలపై అవగాహన చేసుకోవాలని, భవిష్యత్తు , తల్లిదండ్రుల , సమాజం, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు గురించి ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ఇంటర్మీడిట్ కళాశాల ప్రధానోపాధ్యాయులు జె. కృష్ణయ్య మాట్లాడుతూ ప్రతి విద్యార్థి కూడా గ్రామస్థాయి నుండి నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వారు అని ప్రతి ఒక్కరు తల్లిదండ్రుల పట్ల గౌరవభావంతో కలిగి ఉండాలన్నారు. ఇంటర్మీడియట్ దశలో అన్ని విషయాలలో పూర్తిస్థాయి పరిజ్ఞానం సాధించాలని కళాశాలకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, జె. కృష్ణయ్య, అధ్యాపక బృందం అరుణ, ప్రసాద్, బ్రహ్మచారి, శ్రీనివాస్ రెడ్డి, నరసింహారావు నాగరాజు, హేమచందర్ రెడ్డి, బాల రక్ష భవన్ చైల్డ్ లైన్ అధికారి సఫియా, విద్యార్థినీలు పాల్గొన్నారు.