విద్యార్థులు విద్యతోపాటు నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలి

 వికారాబాద్ జిల్లా బ్యూరో జనం సాక్షి ఆగస్టు 3
 విద్యార్థులు విద్యతో పాటు మంచి నాయకత్వ లక్షణాలను అలావర్చుకొని దేశానికి, జిల్లాకు మంచి గుర్తింపు తీసుకోరావాలని జిల్లా కలెక్టర్ నిఖిల అన్నారు. బుధవారం స్థానిక మాడ్గుల్ చిట్టాంపల్లి లోని హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఎక్సెలెన్స్ పాఠశాలలో నిర్వహించిన ఇన్వెస్టిట్యూర్ వేడుకలలో జిల్లా కలెక్టర్ నిఖిల ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.  విద్యార్ధి నాయకులుగా ఎన్నికైన విద్యార్థులు తమ తోటి విద్యార్థులకు రోల్ మోడల్ గా నిలవాలని సూచించారు. విద్యార్ధి దశలోనే నాయకత్వ లక్షణాలు అలావార్చుకొని వచ్చే సమస్యలను ఆదిగమించి ముందుకు సాగాలన్నారు.  భవిష్యత్తులో విజయాలు సాధించాలంటే అపజయాలు తప్పవని లక్ష్యం మేరకు ముందుకు సాగాలని తెలిపారు.  ఈ సందర్బంగా పాఠశాలలో స్కూల్ హెడ్ బాయ్, హెడ్ గర్ల్ ఎన్నికలలో గెలుపొందిన విద్యార్థులకు కలెక్టర్ అభినందించింది వారి చేతుల మీదుగా బ్యాడ్జిలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ మన్సూర్ బాబా ఖాన్, డైరెక్టర్ అలీముద్దీన్ హైదర్, ప్రధాన ఉపాధ్యాయురాలు ప్రభావతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.