విద్యార్థుల్లో సృజనాత్మక శక్తి పెరగాలి: ఎమ్మెల్యే

మహబూబాబాద్‌,సెప్టెంబర్‌11 ( జనంసాక్షి ) :   యూత్‌ పార్లమెంట్‌ పోటీల వల్ల విద్యార్థుల్లో సృజనాత్మక శక్తి పెరగడంతో పాటుగా విద్యప్రమాణాలు మెరుగుపడుతాయని మానుకోట ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌ అన్నారు. హరితహారంలో భాగంగా కూడా పిల్లలు నిరంతరంగా మొక్కలు నాటాలన్నారు. రేపటి భవిష్యత్‌ విూదేనని అందుకు పచ్చదనం కాపాడాలని అన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తితో విద్యార్థులు రేపటి భావి భారతదేశంలో ఉత్తమ రాజకీయనాయకులుగా ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థి దశనుంచే రాజయకీయాలపై అవగాహన పెంచుకోవాలని శంకర్‌నాయక్‌ అన్నారు. జిల్లాస్థాయి యూత్‌ పార్లమెంట్‌ పోటీలు ఇటీవల ముగియగా ఆయన పాల్గొన్నారు. ఈ పోటీల ద్వారా విద్యార్థులు ప్రజాస్వామ్య విలువలను సమగ్రంగా అర్థం చేసుకుని, యువశక్తిని భారత నిర్మాణంలో అంతర్లీనం చేసేందుకు దోహద పడుతుందని అన్నారు. హరితహారంలో భాగంగా గురుకుల పాఠశాల ఆవరణలో ఎమ్మెల్యే మొక్కలు నాటారు.