విద్యార్థుల ప్రగతికి తోడ్పడాలి

– విద్యాధికారి భూక్య సైదా నాయక్                              హుజూర్ నగర్, సెప్టెంబర్ 15(జనం సాక్షి): ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు అప్డేట్ గా ఉంటూ విద్యార్థుల ప్రగతికి తోడ్పడాలని మండల విద్యాధికారి భూక్య సైదా నాయక్ అన్నారు. గురువారం
హుజూర్ నగర్ మండల స్థాయి కాంప్లెక్స్ విషయ నిపుణుల రిసోర్స్ పర్సన్, క్లస్టర్ రిసోర్స్ పర్సన్ లకు ఒకరోజు శిక్షణ స్థాయి కార్యక్రమం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి  సైదా నాయక్ పాల్గొని మాట్లాడుతూ ఎఫ్ ఎల్ ఎన్ మానిటరింగ్ లో పాఠశాల అన్ని కోణాలలో పరిశీలించి యాప్ నందు నిక్షిప్తం చేయాలని తెలియజేశారు. అనంతరం మండల ఎఫ్ ఎల్ ఎన్ నోడల్ ఆఫీసర్ బీరెల్లి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు పీరియడ్ ప్లాన్ ల ప్రకారంగా తరగతిగది బోధన చేస్తూ విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాలను పెంపొందించాలని, మానిటరింగ్ లో రిసోర్స్ పర్సన్ అందరూ ఉపాధ్యాయులకు బోధన, అభ్యసన పురోగతి కొరకు సలహాలు సూచనలు ఇస్తూ పాఠశాలల అభివృద్ధికి తోడ్పడాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో    రిసోర్స్ పర్సన్ లు చేపూరి నరసింహారావు, గొట్టే శ్రీనివాస్, సూరేపల్లి దేవుడు, సురేష్, నందిపాటి సైదులు, ఆర్ శాంత, రామ్మూర్తి, నాగేశ్వరరావు, వెంకన్న, సోమశేఖర్, చందు, జ్యోతి, సిఆర్పీలు సైదులు, బ్రహ్మం, రమేష్ లు పాల్గొన్నారు.