విద్యార్థుల భవిష్యత్తు కోసం అహర్నిశలు కృషి చేస్తా.భూక్య దేవ్ సింగ్ మున్సిపల్ కమిషనర్ (VRS)

ములుగు జిల్లా

గోవిందరావుపేట సెప్టెంబర్ 20 (జనం సాక్షి) :-

మంగళవారం గోవిందరావుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు  ఆహ్వానం మేరకు భూక్య దేవ్ సింగ్ ళాశాలకు విచ్చేసి విద్యార్థులతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా దేవ్ సింగ్ మాట్లాడుతూ గత ఏడు నెలలుగా విద్యార్థుల కోసం నిర్విరామ కృషి చేస్తున్నానని వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేలా వారికి సంబంధించిన స్టడీ మెటీరియల్స్ అందిస్తున్నారని తప్పకుండా మీ భవిష్యత్తు కోసం మీ లక్ష్యసాధన చేరుకునేంతవరకు అహర్నిశలు కృషి చేస్తానని అన్నారు.అదేవిధంగా తాను ఈ కళాశాలకు పూర్వ విద్యార్థినని ఇదే కళాశాలలో చదువుకొని ఉన్నత ఉద్యోగ లక్ష్యాన్ని చేరేందుకు ఇక్కడ నుండే  పునాదులు వేసుకున్నానని తాను చదువుకున్న రోజులు గుర్తు చేస్తూ అందరూ కష్టపడి చదివి మంచి ఫలితాలను సాధించి భవిష్యత్తులో మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని అన్నారు.గతంలో ఇదే కళాశాలలో చదువుకున్న విద్యార్థులకు ఎంసెట్ మరియు నీట్ స్టడీ మెటీరియల్స్ అందజేశానని గుర్తు చేస్తూ ప్రస్తుత విద్యార్థులందరికీ కూడా మీకు చదువుకోవడానికి కావాల్సిన అన్ని రకాల స్టడీ మెటీరియల్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని హామీ ఇచ్చారు.ప్రస్తుతం వాతావరణంలో మార్పుల వల్ల ప్రస్తుతం వస్తున్న వ్యాధులకు సంబంధించి అన్ని రకాల సమాచారం విద్యార్థులకు తెలియజేసేలా పాంప్లెంట్లు రూపొందించి విద్యార్థులకు అన్ని రకాల అవగాహన కల్పిస్తూ అందించడం జరిగింది.వీటితోపాటు కళాశాలలోని అందరి విద్యార్థులకు దాదాపు 100 జూట్ బ్యాగులను అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సామాజికవేత్త దొంతి విజేందర్ రెడ్డి,సేవాలాల్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు పోరిక రాహుల్ నాయక్,సేవాలాల్ సేన ములుగు అధ్యక్షులు బాదావత్ రాజ్ కుమార్ మరియు కళాశాల అధ్యాపక,బృందంవెంకన్న,హిమబింద,శోభారాణి,రజియా, స్వర్ణలత,హరికృష్ణ, అనిత,గణపతి లతోపాటు దాదాపు 100 మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Attachments area