విద్యార్థుల విద్యా ప్రమాణాలను పెంచాలి, బయోమెట్రిక్ తప్పనిసరిగా వినియోగించాలి

-డిఈఓ డాక్టర్ గోవిందరాజులు

నాగర్ కర్నూల్ జిల్లా బ్యూరో అక్టోబర్15 జనంసాక్షి:
తిమ్మాజిపేట, బిజినపల్లి మండలాల పరిధిలోని చేగుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల మంగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బిజినపల్లి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల మరియు సుబ్బయ్య గూడెం ప్రాథమిక పాఠశాలను డిఈఓ డాక్టర్ గోవిందరాజులు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
విద్యార్థుల సమర్థ్యాలను పరిశీలించారు.
ఉపాధ్యాయుల హాజరు బయోమెట్రిక్ యంత్రాలను పరిశీలించి, ఉపాధ్యాయులందరూ తప్పనిసరిగా బయోమెట్రిక్ ఉపయోగించాలన్నారు.
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మంగనూరు ప్రధానోపాధ్యాయురాలు డిఇఓ సందర్శన సమయంలో గైర్హాజర్ అడంపై ఆమెకు డిఇఓ మెమోను జారీ చేశారు.
ముందస్తు అనుమతి లేకుండా పాఠశాలలకు గైరాసరైతే శాఖా పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఉపాధ్యాయులు తప్పనిసరిగా పాఠశాలలకు సమయపాలన పాటించి హాజరు కావాలన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలపై లక్ష్యాల ను నిర్దేశించి, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రమాణాలు పెంచేందుకు చర్యలు చేపట్టాలని ఉపాధ్యాయులను ఆదేశించారు.
కోవిడ్‌ తర్వాత దేశవ్యాప్తంగా విద్యా ప్రమాణాల్లో వచ్చిన మార్పులపై నేషనల్‌ అచీవ్‌మెంట్‌ సర్వే (న్యాస్‌) అనేక విషయాలను వెల్లడించిందన్నారు. విద్యార్థులు భాషల్లో గరిష్టంగా 70% సామర్థ్యం కూడా లేరని, గణితంలో మూడో తరగతిలో 69% మెరుగ్గా ఉంటే, 8వ తరగతిలో కేవలం 37 శాతమే సామర్థ్యం కలిగి ఉన్నారని పేర్కొందన్నారు.
వీటిపై ఉపాధ్యాయులు ప్రణాళిక బద్ధంగా ప్రత్యేక దృష్టి పెట్టకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని డిఈఓ స్పష్టం చేశారు. న్యాస్‌ నివేదికపై ఈ విద్యా సంవత్సరం మొదట్లో జాతీయ స్థాయి సమీక్ష జరిగిందన్నారు.
ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల భాగస్వాము చేసి పురోగతి దిశగా ముందుకెళ్లాలని డిఇఓ సూచించారు.
మధ్యాహ్న భోజన కార్మికుల బిల్లులు విడుదల చేయడం జరిగిందని మధ్యాహ్న భోజనాన్ని నాణ్యత ప్రమాణాలు పాటించి విద్యార్థులకు భోజనాలు అందించాలని డీఈఓ కోరారు.
డిఈఓ వెంట బిజినపల్లి ఎంఈఓ భాస్కర్ రెడ్డి, బిజినపల్లి బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మీదేవమ్మ ఉన్నారు.
Attachments area