విద్యార్థుల సమస్యల పరిష్కారంలో టిఆర్ఎస్ ప్రభుత్వం విఫలం
-టీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జంపాల రాజేష్
సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో తెరాస ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు జంపాల రాజేష్ అన్నారు. స్థానిక పద్మశాలి భవన్ లో టిఎస్ఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ భారీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు.ఫీజు రియంబర్స్మెంట్ సరైన సమయంలో ఇవ్వడం లేదని విమర్శించారు.ప్రైవేట్ కళాశాల్లో ఫీజులు తగ్గించాలని, స్కాలర్షిప్స్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.పాఠశాలలు ఓపెన్ చేసి ఇన్ని రోజులైనా ఇంతవరకు విద్యార్థులకు బుక్స్ ఇవ్వలేదన్నారు.సరైన సమయంలో నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంతో విద్యార్థులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా సమస్యలు పరిష్కరించాలని కోరారు.గ్రామీణ స్థాయిలో విద్యార్థులు ఉన్నత చదువులను మన దేశంలోనే గాక ఇతర దేశాల్లోనూ చదివి ఉన్నతమైన స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.మానవుని ఎదుగుదలకు విద్య ఒక్కటే మార్గమని, విద్య ద్వారా దేనినైనా సాధించుకోవచ్చని అన్నారు.మహిళలంతా సంఘటితశక్తిగా ఏర్పడి సమస్యలు సాధించుకునే వరకు పోరాడాలని అన్నారు.తమ సంఘం విద్యార్థుల సమస్యల పట్ల నిరంతరం పోరాటం చేస్తుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు రమావత్ శేఖర్ నాయక్, రాష్ట్ర కోఆర్డినేటర్ జంపాల రాంబాబు, పుగిళ్ల వీరమల్లు, వీరబోయిన లింగయ్య , గుండాల సందీప్ , తగుళ్ల జనార్ధన్ , కోల కర్ణాకర్ , దండంపల్లి గోవర్ధన్ , తరుణ్ రెడ్డి, రాహుల్, సతీష్ ,వెంకట్ సోమశేఖర్, వీరన్న, మహేష్ తదితరులు పాల్గొన్నారు.