విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ని కలిసిన వికారాబాద్ బిఆర్ఎస్ యువ నాయకులు వడ్ల నందు..
విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారిని వికారాబాద్ బిఆర్ఎస్ యువ నాయకులు వడ్ల నందు గారు.. హైదరాబాద్ లోని మంత్రిగారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారికి విజయదశమి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఆయన తోపాటు వికారాబాద్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రామచంద్ర రెడ్డి, కేరెల్లి ఎంపిటిసి శ్రీనివాస్, పిఎసిఎస్ డైరెక్టర్ దశరథ్ రెడ్డి, వికారాబాద్ కౌన్సిలర్ చందర్ నాయక్, సిద్దులూర్ సర్పంచ్ అంజయ్య, నరసింహారెడ్డి, సామా ప్రభాకర్ రెడ్డి, దారూర్ మండల వైస్ ఎంపీపీ విజయ్ కుమార్, కొండాపూర్ కలాన్ సర్పంచ్ పరమేష్, నాయకులు లక్ష్మయ్య, ఇతర దారుర్ మండల నాయకులు ఉన్నారు.