విద్యాసంస్థల బంద్ విజయవంతం

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):
రాజస్థాన్ లో ఓ స్కూళ్లో విద్యార్థి కుండలో నీళ్లు తాగారనే కారణంతో టీచర్ కొట్టడంతో ఇంద్రకుమార్ మేఘవాల్ అనే దళిత విద్యార్థి మృతి చెందడాన్ని నిరసిస్తూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలో యాతాకుల రాజన్న ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్ ను నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లయిన కుల దురహంకారం కొనసాగించడాన్ని తీవ్రంగా ఖండించారు.అనంతరం ఇంద్ర కుమార్ మేఘవాల్ ఆత్మశాంతి కొరకు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ సమన్వయకర్త చింతలపాటి చిన్న శ్రీరాములు మాదిగ, ఎమ్మెస్పీ నాయకులు ఎర్ర వీరస్వామి మాదిగ , బోడ శ్రీరాములు , ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యదర్శి బొజ్జ సైదులు మాదిగ , ఎమ్మెస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మామిడి కరుణాకర్ మాదిగ , ఎల్ హెచ్ పీఎస్ నాయకులు ధరావత్ నాగేంద్ర నాయక్, బీసీ విద్యార్థి సంఘం నాయకులు సంపత్ నాయుడు, నాయకులు పుట్టల మల్లేష్, దాసరి వెంకన్న , గార కనకయ్య , చెరుకుపల్లి చంద్రశేఖర్, సిరిపంగి లింగస్వామి, సిరిపంగి బిక్షం కంభంపాటి రమేష్, మిరియాల చిన్ని , సూరారపు మణిదీప్ , వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.‌