విద్యుత్ ఉపకేంద్రంపై రైతుల దాడి
వరంగల్ విద్యుత్ కోతలను నిరసిస్తూ వరంగల్ జిల్లా శాయంపేట విద్యుత్ ఉప కేంద్రాన్ని రైతులు ముట్టడించారు. అప్రకటిత కోతలను ఎత్తివేయాలంటూ ఆందోళనకు దిగిన రైతులు కార్యాలయంలోకి వెళ్లి ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.