విద్యుత్ ప్రాజెక్టులు పూర్తయితే మిగులు
ఖమ్మం,మార్చి30(జనంసాక్షి): ఖమ్మం జిల్లాలోని మణుగూరులో 1080 మెగావాట్ల భద్రాది విద్యుత్తు ప్రాజెక్టు, పాల్వంచలో 800 మెగావాట్ల కేటీపీఎస్ ఏడో దశ ప్రాజెక్టును చేపట్టిందని టీఎస్ జెన్‌కో అధికారులు అన్నారు. అవి మూడేళ్లలో పూర్తి చేసే లక్ష్యంతో టీఎస్ జెన్‌కో ఉందన్నారు. వరంగల్ జిల్లా భూపాల్‌పల్లి కాకతీయ థర్మల్ ప్రాజెక్టు 600 మెగావాట్ల కర్మాగారాన్ని వేగిరం చేసి ఈ ఏడాది జూన్‌నాటికి పూర్తిచేయాలనే లక్ష్యంతో ఉన్నామన్నారు. ఇవన్నీ పూర్తియితే సిఎం చెప్పినట్లుగా మన రాష్ట్రంలో విద్యుత్ కొరత ఉండబోదన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో థర్మల్ 2,282.5 మెగావాట్లు, జలవిద్యుత్ 2,081 మెగావాట్లు, సోలార్ 1 మెగావాట్ ఉత్పత్తవుతోందని చెప్పారు. నూతనంగా నల్గొండ జిల్లా దామరచర్లలో 4,800 మెగావాట్లు, అదే జిల్లాలో ఈర్లపాకలో 2,400 మెగావాట్ల ప్రాజెక్టుల నిర్మాణాల కోసంప్రభుత్వం భూసేకరణ చేపట్టిందని అన్నారు. టీఎస్ జెన్‌కో ఉద్యోగులు, కార్మిక సంఘాలు, ఇంజినీర్లు విద్యుత్తు ఉత్పత్తి లక్ష్యంగా పనిచేయాలని కోరారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు లక్ష్యానికి అనుగుణంగా తెలంగాణ జెన్‌కో అధికారులు దృఢ సంకల్పంతో ఉన్నారని అన్నారు. మరో మూడేళ్లలో మిగులు విద్యుత్తు ఉత్పత్తి చేసే రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని అన్నారు. ప్రస్తుత విద్యుత్ రాష్టావ్రసరాలకు అనుగుణంగా లేదన్నారు. నూతన ప్రాజెక్టుల ఆవశ్యకత గుర్తించిన ప్రభుత్వం కొత్తగా ప్రాజెక్టులను చేపట్టిందని అన్నార