విద్యుత్ సర్ ఛార్జీలను ఎత్తివేయాలి
కుత్బుల్లాపూర్ : పెంచిన విద్యుత్ సర్‌ఛార్జీలను, కోతలను ఎత్తివేయాలని కోరుతూ కుత్బుల్లాపూర్ సీపీఐ అధ్వర్యంలో జీడిమెట్ల సబ్‌స్టేషన్ ముందు ధర్నా నిర్వహించారు. నియోజక వర్గ కార్యదర్శి ఐలయ్య, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఏనురత్నం ఈ సందర్బంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అసమర్థత వల్లే విద్యుత్ ఛార్జీలు పెరుగుతున్నాయని అరోపించారు. విద్యుత్తు కోతను వెంటనే ఎత్తి వేసి పరిశ్రమలను కాపాడాలని కోరారు.