విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే హరీష్ మృతి
రుద్రంగి అక్టోబర్ 17 (జనం సాక్షి)
మండల కేంద్రంలో ఇటీవల విద్యుత్ షాక్ తో మృతిచెందిన హరీష్ కుటుంబాన్ని ఆదివారం పీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్ పరామర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే కట్కూరి హరీష్ ప్రాణాలు కోల్పోయాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే అన్ని విధాల ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మృతుడి కుటుంబానికి 5 లక్షలు అందించాలని వారు కోరారు. అక్కడున్న విద్యుత్ స్తంభాన్ని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.అదే విధంగా గత మూడు రోజుల క్రితం అనారోగ్యంతో మరణించిన బుఖ్య రెడ్డి, కట్కూరి భూమయ్య ల కుటుంబాలను పరామర్శించారు.ఈ కార్యక్రమంలో డిసిసి కార్యదర్శి చేలుకల తిరుపతి,గడ్డం శ్రీనివాస్ రెడ్డి,సామ మోహన్ రెడ్డి,తర్రే లింగం,పల్లి గంగాధర్,దాసు,మనోజ్,సనుగుల గంగాధర్,పులి సత్యం,రవి,మ్యకల అంజయ్య,రాజారెడ్డి,జెలెందర్,పూల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.