విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేస్తే అంధకారమే …. ఎం.యాసయ్య
ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ సాగర్లో విద్యుత్తు ఉద్యోగుల ఆందోళన
నాగార్జునసాగర్ (నందికొండ),ఆగస్టు 08,(జనం సాక్షి); నాగార్జునసాగర్ తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగులు సోమవారం
విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ యోచనను వ్యతిరేకిస్తూ
స్థానిక చీఫ్ ఇంజనీర్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు.పైలాన్ ప్రధాన జలవిద్యుత్ కేంద్రం నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు.తక్షణమే కేంద్రప్రభుత్వం ఈ ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తామంతా మెరుపు సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.
ఈ సందర్భంగా తెలంగాణ ఎలక్ట్రిసిటీ జాయింట్ యాక్షన్ కమిటీ నాగార్జునసాగర్ చైర్మన్ యం.యాసయ్య మాట్లాడుతూ తాజాగా కేంద్రం తీసుకొచ్చిన అమెండ్‌మెంట్‌లో డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ చేయాలంటే కచ్చితంగా డీ లైసెన్సింగ్ అవసరమని,దీనికి సొంత లైన్ అవసరం లేదని,ప్రస్తుతం ఉన్న కరెంట్ లైన్లనే వాడుకోవచ్చని చట్టం చెబుతోందన్నారు. ఇలా బిజినెస్ చేయడానికి ముందుకొచ్చే వారికి కచ్చితంగా అనుమతి ఇవ్వాల్సిందేనని కేంద్రం ఇందులో పేర్కొందని ఆయన తెలిపారు.దీనివల్ల ఎవరైనా వ్యక్తులు ప్రస్తుతం ఉన్న లైన్ల ద్వారానే విద్యుత్ సరఫరా వ్యాపారం చేసుకోవచ్చనే అర్థం ఉందని దీనివల్ల రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలైన డిస్కంలు తీవ్రంగా నష్టపోతాయని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ బిల్లు వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని రాష్ట్రాలకు ఉన్న అధికారాలను నీరుగార్చేలా ఉన్న బిల్లును మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నామని ఉద్యోగులు చెబుతున్నారు. ఈ చట్ట సవరణ వల్ల వినియోగదారులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని విద్యుత్ సిబ్బంది స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో
కన్వీనర్ సంజీవరెడ్డి, ఏ డి ఈ జానారెడ్డి,రామకృష్ణ, శివకుమార్,తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయ్ జాయింట్ యాక్షన్ కమిటీ నాగార్జునసాగర్ అమీర్, ఆలీ,
బత్తుల రాజు,బడే సాహెబ్, విద్యుత్ గెస్ట్ హౌస్ హరి,మస్తాన్ వలి,రూపు సింగ్,కృష్ణ ప్రసాద్,మహిళ అసోసియేషన్ సభ్యులు సులక్ష్మి,ఉమా తదితరులు పాల్గొన్నారు.