విద్యుత్ షాక్ తో ఆవు మృతి.
మృతి చెందిన ఆవు.
నెన్నెల, సెప్టెంబర్19,(జనంసాక్షి)
నెన్నెల మండలం మన్నెగూడెం గ్రామంలో సోమవారం ఉదయం కరెంటు షాక్ తో ఆవు మృతి చెందింది. వివరాల్లోకి వెళితే మన్నెగూడెం గ్రామానికి చెందిన గొలుసుల పోశం అనే రైతుకు పది సంవత్సరాల పాలిచ్చే ఆవు ఉదయం మేత కోసం వెళ్లి కరెంటు షాక్ తో మృత్యువాత పడింది. ట్రాన్స్ఫార్మర్స్ చుట్టూ కంచె లేకపోవడంతో ట్రాన్స్ఫార్మర్స్ ఎర్త్ వైర్ తగిలి మృతి చెందిందని బాధితుడు వివరించాడు. చనిపోయిన ఆవు విలువ సుమారు ₹ 40 వేల రూపాయల వరకు ఉంటుందని సంబంధిత అధికారులు స్పందించి నష్ట పరిహారం ఇప్పించి ఆదుకోవాలని బాధితుడు వేడుకుంటున్నారు. సంఘటన స్థలాన్ని స్థానిక సర్పంచ్ గొర్లపల్లి బాపు సందర్శించి బాధితున్ని ఓదార్చారు. సమస్యను విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. బాధితునికి పరిహారం అందేలా చర్యలు తీసుకుంటానని ఆయన తెలిపారు.