విద్యుత్ షాక్ తో కాంట్రాక్ట్ కార్మికుడి మృతి

ఆదిలాబాద్, మే 12 :విద్యుత్ షాక్ తో కాంట్రాక్ట్ కార్మికుడి మృతి చెందాడు. విషాదకర ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లాలోని పామెల గ్రామంలో జరిగింది. పామెల వద్ద విద్యత్ మరమ్మతులు జరుగుతున్నాయి. పనులు జరుగుతుండగా విద్యుత్ ప్రసారం జరగింది. దీంతో,  మరమ్మతుల్లో పని చేయడానికి వచ్చిన కాంట్రాక్టు  కార్మికుడు కృష్ణయ్య మృతి చెందాడు.