విద్యుత్ షాక్ తో యువకుడు మృతి
రుద్రంగి అక్టోబర్ 13 (జనం సాక్షి)
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో కట్కూరి హరీష్ (25) అనే యువకుడు విద్యుత్ షాక్ తో గురువారం మృతి చెందాడు.వివరాల్లోకి వెళితే గురువారం ఉదయం హరీష్ తన బట్టలను దండంపై ఆరవేస్తూ ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు.మృతునికి ఈ మధ్యనే వివాహం జరిగిందని,హరీష్ మృతి చెందడంతో అతడి కుటుంబం రోడ్డున పడిందని ప్రభుత్వం ఆయన కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రమేష్ బాబు, ఎంపీపీ గంగం స్వరూప మహేష్,జడ్పిటిసి గట్ల మీనయ్య మృతుడి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపి. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా అన్ని విధాల ఆదుకుంటామన్నారు.