విద్య, వైజ్ఞానిక ప్రదర్శనలో రాష్ట్రస్థాయికి ఎంపిక
అవార్డును అందుకుంటున్న రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థులు
ఎల్లారెడ్డిపేట నవంబర్ 11 (జనంసాక్షి) రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈనెల 8నుండి 10వ తేది వరకు జరిగిన విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనలో ఎల్లారెడ్డిపేట మండలంలోని అల్మాస్‌పూర్ గ్రామంలో గల జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు ప్రథమస్థానం పొంది రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు పాఠశాల ప్రదానోపాద్యాయులు మద్దికుంట లక్ష్మణ్ తెలిపారు. ఈ సందర్బంగా లక్ష్మణ్ మండలకేంద్రంలో ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ తమ పాఠశాలకు చెందిన విద్యార్థి ఎం అభినయచారి సిరిసిల్లలో జిల్లాస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి పోటీలకు ఎంపికయ్యారన్నారు. అభినయచారి వ్యవర్థపదార్థాల నిర్వహణ విభాగంలో విద్యార్థిప్రదర్శన కాగితం పునర్వినియోగం అందరిని ఆకట్టుకుందన్నారు. అదే విధంగా మరో విద్యార్థి అయిన పి. సంజయ్‌మణికంఠ పక్షులు, జంతువుల నుండి పంటలు రక్షించుకునే పరికరం ప్రవేశపెట్టగా న్యాయమూర్తుల ప్రశంసలను పొంది ద్వితియస్థానాన్ని దక్కించుకున్నారన్నారు. రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థులకు జిల్లా విద్యాదికారి రాదకిషన్ చేతుల మీదుగా అవార్డులను అందుకోవడం జరిగిందన్నారు. రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థులకు తమ పాఠశాల ఉపాద్యాయులు వెంకట్రాంరెడ్డి, గంగాధర్, మల్లీకార్జున్, విక్రమ్ శైలజ, సునీతా, రామచంద్రం, జ్యోతిలతో పాటు గ్రామప్రముకులు అబినందిచినట్లుతెలిపారు.