విధులకు ఆటంకం కలిగిస్తే కటకటాలపాలే…
పట్టణ సీఐ రాజేందర్ రెడీ.
తాండూరు జూలై 17 (జనం సాక్షి)పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తే కటకటాల పాలు తప్పవని పట్టణ సిఐ రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు.శనివారం ఉదయం 03:00 గంటల సమయంలో పాత తాండూర్ గడి లో మదర్స తాలిముల్ ఖురాన్ దర్గా యొక్క గంధము ఊరేగింపు కార్యక్రమము పెంటయ్య విగ్రహం వద్దకు రాగానే అక్కడ పాత తాండూర్ కు చెందిన మహమ్మద్ అబ్రార్ హుస్సేన్, ఎండి మతిన్, ఎండి షొయాబ్ మరియు ఆరోన్ లు కలిసి అక్కడ గంధము ఊరేగింపు కార్యక్రమము నిర్వహిస్తున్న వారితో బ్యాండు కొట్టరాదు, ఊరేగింపు చేయరాదు అని అడ్డుకోవడంతో అక్కడే బందోబస్త్ లో చేస్తున్న ఎస్ఐ మహిపాల్ రెడ్డి మరియు పోలీసులు వెంకటరాములు, ఇక్బాల్ వారిని గొడవ చేయరాదు అని వారికీ చెప్పడానికి ప్రయాతించగా వారు ఎస్ఐ మహిపాల్ రెడ్డి మరియు పోలీసులతో దురుసుగా ప్రవర్తించి వారి విధులకు ఆటంకం కలిగించినారని పేర్కొన్నారు.ఈ విషయం పై కేసు నమోదు చేసి వారిని జ్యుడీషియల్ రిమాండ్ పంపడం జరిగిందని తెలిపారు